ఋతువుల రగడ (బాలలకథ)( "రాజశ్రీ" కవితా ప్రక్రియలో)(రెండవభాగము);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 6)
మండే సూర్యుడు వెంటున్నా
పగలే వెలుగును పండిస్తున్నా
గ్రీష్మ ఋతువును నేనేఅంటే
మానవ సేవను చేస్తావింటే!
7)
వరినీ చెరుకును దరికిచేర్చి
మామిడి ఫలాలకు రుచికూర్చి
చేమంతుల బంతుల మురిపముని
మనుషులకు మేలు చేసేవాడిని!
8)
ఇలకు నేను వచ్చేస్తా
సాగర జలమును ఆవిరిచేస్తా
వాటిని ఆకాశానికి అందిస్తున్నా
మేఘ మాలికలు కూర్చేస్తున్నా!
9)
వానకు దారిని చూపిస్తా
ప్రాణుల కన్నీరు తుడిచేస్తా
మానవ సేవను చేస్తాను
మనుషుల మేలు చూస్తాను!
10)
అన్నింటికీ నేనే మూలం
నాకు మించి లేదేకాలం
అందుకే అంటున్నా నేనేగొప్పా
అలా అనడం తప్పా?
(సశేషము)

కామెంట్‌లు