డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్ కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం


 శ్రీ గిడుగు రామ్మూర్తిపంతులు గారి జయంతిని పురస్కరించుకొని "సేవ" సాహితీ సంస్థ వారు
""సేవ సాహితీ సప్తాహం"" పేరిట నిర్వహించిన తెలుగు భాషా వారోత్సవాల్లో వచన కవితల విభాగంలో పాల్గొని "ఉనికి" అనే వచన కవితను చదివి వినిపించిన సందర్భంగా ప్రముఖ బాలసాహిత్య పరిశోధకులు, సాహితీవేత్త, సంగారెడ్డి జిల్లా జోగిపేట గ్రామ వాస్తవ్యులు డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది . దాదాపు ఇరవై దేశాల నుండి వెయ్యి మంది కవులు , కవయిత్రులు 23/08/2021 నుండి 29/08/2021 వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు జరిగిన జూమ్ అంతర్జాల సమావేశంలో పాల్గొన్నారు . ఇది ఇంతమంది గొప్ప గొప్ప కవులు , కవయిత్రులతో సేవ సంస్థ వారు ఒక వారం రోజుల పాటు నిర్వహించిన సాహితీ యజ్ఞం. ఇలాంటి ఒక అపురూపమైన ఘట్టంలో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతం అనీ వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు . అదే సందర్భంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం పొందిన ధృవీకరణ పత్రాన్ని సెప్టెంబర్ అయిదున పంపడమే కాకుండా 25/11/2021వ తేదీన డాక్టర్.గౌరవరాజు సతీష్ కుమార్ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఈ-సర్టిఫికెట్ ను అందజేశారు. దీనితో కవిగా తనకు మరింత బాధ్యత పెరిగిందని, కవితా వ్యాసంగం నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నదని తమ అభిప్రాయం వెలిబుచ్చారు .
ఈ నేపథ్యంలో తనను ప్రోత్సాహించిన గురువులకు,మిత్రులకు మరియు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కామెంట్‌లు