జబ్బుకు తగిన వైద్యం - జయా
 ఓ ఇంట భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో
గొడవ జరుగుతోంది.
గంటకుపైగా మాటల తూటాలు పేలుతున్నాయి ఇద్దరి మధ్య.
అయితే ఉన్నట్లుండి గొడవ సద్దుమణిగింది.
అందుకు కారణం ఒక్క మాటే...
అదీనూ ఆ భర్త చెప్పిన మాట!
"నువ్వు అందంగా ఉన్నంత మాత్రాన ఏదన్నా భరించాలా?" అని అతను చెప్పిన క్షణమే ఆమె వంట గదిలోకి వెళ్ళి అతనికిష్టమైన పకోడి చేసి తీసుకొచ్చి ఇచ్చింది. వేడి వేడి కాఫీ కలిపి తీసుకొచ్చి అతని ముందుంచింది. 
ఈ చిన్నపాటి సంఘటన వల్ల తెలుసుకోవలసిన విషయం....
రోగానికి మూలమేంటో గుర్తించి దానికి వైద్యం చేయాలి తప్ప రోగికి కాదని!
- తమిళంలో చదివాను -

కామెంట్‌లు