ఉల్లి కాడతో పాము డా:కందేపి రాణి ప్రసాద్

 డియర్ చిల్డ్రన్! ఇది ఉత్తుత్తి పామే, భయపడకండి.పాముల గురుంచి చదివే శాస్త్రాన్ని ఏమంటారో తెలుసా!సర్పెంటాలజీ అంటారు.పాములు 'స్క్వామెటా ' క్రమానికి, ఓపిడియా ఉపక్రమానికి చెందినవి.వీటిలో చాలా వరకు విషరహితమైనవవే ఉంటాయి.విష సర్పాలలో సముద్ర సర్పాలు ప్రమాదకరమైనవి.ఇంకొక ముఖ్య విషయం తెలుసా!
న్యూజిలాండ్ లోను ఐర్లాండ్ లోను అసలు పాములు ఉందనే ఉండవట.సరే ఇప్పుడు మనం ఉల్లికాడ పామును తయారుచేద్దామా!
ఉల్లికాడలతో పాము ఆకారంలో ఉండే దానినొకదాన్ని కొంచుకొని చివర ఉన్న జుట్టును కత్తిరించి వేయాలి.అక్కడ కత్తితో లోతుగా ఒక గాటు పెట్టాలి.ఇది నోరు కోసం అన్నమాట.ఇందాక కత్తిరించిన ఉల్లి జుట్టును రెండు పిసులు నోటిలో దూర్చాలి.ఇది నాలుక అన్నమాట.కళ్ళకోసం రెండు అవాల గింజలను అతికించాలి.అంతే ఉల్లిపాము తయారైపోయింది.
కామెంట్‌లు