పండుటాకులుమర్రి జయశ్రీ-కలం స్నేహం
 మానవ జీవన పరిణామ క్రమంలో 
అన్ని దశలను సంపూర్ణం చేసుకొన్న మలిదశ
ఎన్నో అనుభవాలను గడించి
గుణపాఠాలెన్నో నేర్చుకొని
చేరుకున్న జీవిత చరమాంకం
పుడమి తల్లి గర్భానికే ఇక చేరడం
పెరిగే వయసుతో
తిరిగి బాల్యదశకు చేరుకొనే దయనీయ స్థితి
రోగ నిరోధక శక్తి తగ్గిపోయి
కంటి చూపు,వినికిడి లోపించి
చురుకుదనం తగ్గడంతో
వృద్దుడ0టే వ్యర్థానికి ప్రతిరూపమని 
 అనుభవం లేని అమాయకులు గేలి చేస్తే
తల్లడిల్లిపోతూ
సంతోషం  అంటే తెలియని
ఒంటరితనంతో బాధపడిపోతూ
మానసిక సమతుల్యత కోల్పోయి
మదనపడే వృద్ధులను కాపాడాలి పసిపాపల్లా
కనిపెంచిన ఋణం తీర్చుకునేందుకైనా
రాలిపోయే పండుటాకుల
కాచుకోవాలి కంటికి రెప్పలా
ఆధునిక కాలం అనుబంధాలకు దూరం
కన్నవారే బరువైన కలికాలం
మలిసంధ్య లో వేదన పడకుండా
వృద్దాశ్రమాల దారి చూపకుంటే
అంతకన్నా మహాత్భాగ్యమేముంటుంది

కామెంట్‌లు