అందరికీ శుభం! (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఆంజనేయుడు మహావీరుడు
బ్రహ్మవిష్ణు శివాత్మకుడు
ఎక్కడెక్కడ రామభజననో
అక్కడక్కడ తానుంటాడు
కనులుమూసుకుని ఉంటాడు
కైమోడిచి తానుంటాడు
భజనలుచేస్తూ ఉంటాడు
హనుమంతుడికున్నది ఒకతోక
తోకకాదు అది యమునిదండం
దండంకాదది ఇంద్రునివజ్రం
వజ్రంకాదది విష్ణునిచక్రం
అన్నీకలిసిన గొప్ప ఆయుధం
ఆంజనేయుని స్మరించినంతనే
గాలీ ధూళీ పరారు
దయ్యం భూతం పరారు
మన కష్టాలన్నీ పరారు
మన అందరికీ శుభం శుభం !!

కామెంట్‌లు