చలిపులి ..!! (మాటలు:ఆన్షి, రాతలు:కె.ఎల్వీ,)

 చలి ..చలి ..చలి ..చలి ..
చలికాలం ..చలికాలం ..
చలికాలం వచ్చేసింది 
చలిపులి తరుముకొచ్చి
గృహనిర్బందం 
చేసేస్తుంది ....!
ఇంట్లో ..
పంకాతిరిగితే 'చలి'!
పంకాతిరగకుంటే 
ఒకపక్కదోమలమోత
మరోపక్క ఉక్కబోత...!
స్వెట్టర్ వేసుకోకుంటే 
వణికించే చలి ...!
స్వేట్టర్ వేసుకుంటే ....
చెమటలకు బలి ....!
అందుకే ఆలోచించా ...
తాత మఫ్లర్ తీసి ....
మెడచుట్టూ చుట్టేసా !
చలిపులిని తరిమేసా ..!!

కామెంట్‌లు