విద్య ; -మాడుగుల మురళీధరశర్మ కాళేశ్వరం/సిద్ధిపేట
ఉమా:-1
విద్య వివేక వర్ధినిగ*
విజ్ఞత పంచెడు విశ్వగామిగా!
విద్యవిరాజమానమవ*
వేత్తగ వర్ధిలు నిజ్జగంబునన్!
విద్యకునెల్లలున్నెరుగ*
విశ్వవిధాతకునేలసాధ్యమౌ!
విద్యయశోవిశాలతల*
వేల్పులునైననెఱుంగశక్యమే!

చం.మా:-2
చదువుకొనంగరాదనుచు*
సద్బుధశ్రేణులుచెప్పుచుందురీ!
చదువుకునంగవచ్చునను*
సత్యమెరుంగినచాలుసత్కవుల్!
చదువరులైననేమి?సరి*
చక్కటియుచ్చరణంబులేనిచో!
చదువనవర్ణమాలగని*
చక్కగవ్రాయుచుపల్కచాలుగా!

శార్దూలము:-3
విద్యామానవివేకహీనజనులున్*
వేవేలుమూర్ఖాత్ములై!
విద్యావ్యాపకవాణివర్తకులునై*
విన్వీధులన్నేగుచున్!
విద్యావంద్యులదూరమేర్చువసుధన్*
విశ్వాసముల్వీడుచున్!
సద్యోజాతసరస్వతీమనములన్*
సన్మాతృకాశోకతన్!

మత్తేభము:-4
సలిలోధ్భాసితమౌహిమమ్ముకలిలో*
సద్విద్య సంప్రాప్తిగన్!
వలలోచిక్కినమీనరూపచదువుల్*
వ్యర్థమ్మనర్థమ్ములై!
కలికాలమ్మునకల్మషమ్ములగుచున్*
కాఠిన్యమౌకావ్యముల్!
తలలన్వీడుచుయంంత్రరాజములలో*
తానిండుచుండెన్గదా!

కందము:-5
ధనమా?విద్యా?యనుచును
అనుదినమందుననుజనులు*
నరమరికలతో!
కనుగొనలేకయె సతతము
అనుమానముతోడమ్రగ్గు*
నధికులు నధిపా!
**********

కామెంట్‌లు