**డొల్ల వ్యాపకాలు*;-**సాగర్ రెడ్డి****చెన్నై**
సంసారంకొరకే సంపాదన
అన్న నీతిని మరచి
 సంపాదనే జీవితం అనే
ఎండమావుల వెంట చేసే 
అలుపెరగని పయనం ఏనాటికైనా
ఆశాభంగ జీవితమే!!

తీరికలేని, తీరికదొరకని
పయనమూ ఒక వ్యసనమే.
తల్లితండ్రులకు పాకే 
ఆ వినాశన వ్యసనమే
సంతానం సర్వనాశనం,
బాల్యమంతా బుగ్గిపాలు!!

తల్లితండ్రులనెపం,
తీరికలేని సమయంపై-
సంతానం దృష్టి సర్వం,
సులభ ఆకర్షణలకు లోనయ్యే వినాశకాలపై.
భీతిలేని బాల్యం, అదుపుచేయని పెద్దరికం,
అంతిమ ఫలితం బాల్యజీవితం సర్వనాశనం!!

ఆస్వాదించి అనుభవిస్తే
సమయం లేని జీవితంకాదు నేటి మనిషిది,
ప్రతివ్యాపకానికీ తగిన సమయం,
సంతాన బాంధవ్యాల కొరకై సంయమనం, 
అందిపుచ్చుకుని  సాగడమే సుఖజీవితం.
పై మెరుగుల దర్పజీవితాలు ఏ నాటికైనా వ్యర్ధపూరితాలు!!


కామెంట్‌లు