సునంద భాషితం;-*వురిమళ్ల సునంద, ఖమ్మం*

  *సంతోషమే బలం*
****************
*సంతోషమే బలం.బలగం.  సంతోషం అనేది గొప్పదైన మానసిక ఆనందం.*
*అద్భుతమైన మానవ జన్మ పొందడమే అదృష్టంగా భావించి,*
*ప్రతి క్షణాన్ని తృప్తిగా ఆస్వాదించేలా మలుచుకుంటే.. అంత కంటే సంతోషం మరొకటి లేదు.*
 *మనసుకు నచ్చిన పనులు చేసినప్పుడు*, *ప్రయత్నాలు సఫలీకృతం అయినప్పుడు*
*మనసుకు శరీరానికి* *పట్టరాని సంతోషం కలుగుతుంది.*
*ఈ విధంగా మనతో పాటు ఇతరులకు కూడా నచ్చే, మెచ్చే పనులే   సంతోషాన్ని ఇస్తాయి. మనకు అంతులేని బలం బలగం ఇవే*
*ప్రభాత కిరణాల నమస్సులతో🙏*
 

కామెంట్‌లు