సునంద భాషితం;- *వురిమళ్ల సునంద,ఖమ్మం*
 *తొందరపాటు*
********************
*తొందరపాటు తనం అనేక అనర్థాలకు, పొరపాట్లకు దారి తీస్తుంది.*
*తొందరపాటు అనగా ఏమీ ఆలోచించకుండా గబగబా నిర్ణయాలు తీసుకోవడం.*
*ఏదైనా పని చేసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ తొందరపాటు కూడదు. దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది.*
*సాధ్యాసాధ్యాలు అలోచించకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకునే వారు... ఆ తర్వాత  తీరిగ్గా కూర్చుని విచారించాల్సి వస్తుంది.* 
*ఏం జరిగిందో  కారణం తెలుసుకోకుండా  తొందరపాటుతో ఎదుటి వారిపై నిందారోపణలు  చేస్తుంటారు కొందరు..*
 *దాని వలన ఎదుటి వ్యక్తులు గాయ పడతారు. నిజం తెలిసిన తర్వాత అన్నవాళ్ళూ బాధ పడతారు.*
 *ఓ చిన్న తొందరపాటు వారి మధ్య అంతులేని అగాధాన్ని ఏర్పరుస్తుంది.*
 *అందుకే ..ఏదైనా అనేటప్పుడు , చేసేటప్పుడు కొంత సమయాన్ని  తప్పకుండా తీసుకోవాలి.*

 *ప్రభాత కిరణాల నమస్సులతో🙏*


కామెంట్‌లు