గీతాంజలి ;--రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 43."స్మృతిముద్ర" నీకోసం అలంకారితనై ఆయత్తంగాలేను సమూహాన సాధారణుడివై పిలుపులేకున్నా నా హృదయసీమను అధిష్టించి నాదుక్షణిక జీవితాన చెరగని ముద్రను వేసితివి.
నా జీవన మధుర క్షణాలపై నీ స్మృతి ముద్రను చూసినప్పుడు నా స్మృతి పధంలో లేని నా అప్రధాన సుఖదుఃఖాల ధూళిలో అవి చెల్లాచెదురుగా పడివున్నట్లు గమనిస్తాను. పసితనపు ధూళిక్రీడల ఆసక్తిని నువ్వు మరువలేదు. నా ప్రాంగణంలో వినిపించు నీ పద క్రీడాసవ్వడి గ్రహంనుంచి గ్రహానికి వ్యాపించింది.

కామెంట్‌లు