న-కారాత్మకాలోచనలు;;--మాడుగులమురళీధరశర్మ-- కాళేశ్వరం/సిద్ధిపేట
సీసం:
ఎవ్వాని మనసున*
ఏడుపు నుండునో!
యేబ్రాసిగాపైకి*
నెదుగలేడు!
ఎవ్వాడు క్రోధిగా*
నెగురుచునుండునో!
నవ్వానిశత్రువు*
లరయుచుండు!
ఎవ్వాడు హింసయే*
నెలమినమోహిగా!
కులుకుచు నుండునో*
కువలయమున!
ఎవ్వాడహంకార*
మీర్ష్యతో స్వార్థుడో!
నవ్వాడుగర్వాంధు*
డగుటనిజము!

తే.గీ
ఇట్టి మనసిజ భావాలు*
నెవరియందు!
నిండు చుండిన మూర్ఖుడై*
నీతివీడి!
అంధకారము బాటలో*
ననుదినమ్ము!
జీవితాంతము మ్రగ్గును*
చావలేక!

స-కారాత్మకాలోచనలు
  ******
సీసం:
సద్భావనాత్మక*
సాలోచనలచేయ!
ఆనందమందించు*
నవనిలోన!
ప్రేమలుపంచుచు*
ప్రియముగామాట్లాడ!
నాదరించెదరంత*
నాత్మతృప్తి!
సద్బుధ్ధిసద్దయ*
సావధానతనిండి!
సన్మార్గ దర్శిగా*
సాగుచుండి!
క్షమియించుగుణము;న*
క్షయముగాకలిగిన!
శాంతిసౌఖ్యములందు*
సాదరమున!

తే.గీ.
నిత్యజీవనసంగ్రామ*
నీడలోన!
సాగునుసకారాత్మస*
త్సంగములుగ!
మనుజునాత్మనాలోచన*
మంంచిదైన!
శాంతిసౌభాగ్యసౌఖ్యముల్*
క్రాంతి నిచ్చు!
*******

కామెంట్‌లు