సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం; అద్దంకి లక్ష్మి

 సాహితీ బృందావన జాతీయ వేదిక
 ప్రక్రియ సున్నితం రూపకర్త  శ్రీమతి  నెల్లుట్ల సునీత గారు
==========================================
36
జగమంతా నాదనుచు మురిపించె
 తీయనైన రాగాలు పలికించె 
మయూరాల నాట్యాలు ఒలికించె
చూడచక్కని తెలుగు సున్నితంబు
37
సుగంధాల సుమధురాలు కురిపించె
 తేనెలొలుకు భావాలు అలరించె
 ఈనేల ఈఊరు పల్లవించే
చూడచక్కని తెలుగు సున్నితంబు
38
జాబిలమ్మతో జోలపాట పాడించే 
కొమ్మ మీద కోయిలమ్మతో పలకరించె
 అలతిఅలతి పదాలు నావనిపించే
చూడచక్కని తెలుగు సున్నితంబు
39
కఠినమైన మాటలతో గర్జించె 
అక్షరాలు ఆయుధములు గ సంధించె
 అక్రమ అవినీతిపరులను వణికించె
చూడచక్కని తెలుగు సున్నితంబు
40
సినీ జగత్తులో ధ్రువతారగా వెలిగె
నంది పురస్కారములు పొందె
సీతారాము సిరివెన్నెలుగ అమరుడైనిలచె
చూడచక్కని తెలుగు సున్నితంబు
కామెంట్‌లు