సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం;---అవ్వారి ఉమాభార్గవి* సూర్యాపేట
అలవోకగా అక్షరాలందించే కవివర్యా
అవనిలోన సాహిత్యపు ఆచార్యా
వెండితెరకు ముద్దుబిడ్డవి ఆర్యా
చూడచక్కని తెలుగు సున్నితంబు!
   

అదిభిక్షువుపై పాటలెన్నో రాసుకుని
చందమామను రమ్మంటూ పిలుచుకుని
సిరివెన్నెలను ఇంటిపేరుగా మలచుకుని
చూడచక్కని తెలుగు సున్నితంబు

సాహిత్యపు ఉద్యానవనాన రారాజువి
మనసుల రంజింపచేసిన సుగంధానివి
మధురతేనెలు ఒలికించిన తేనెటీగవి
చూడచక్కని తెలుగు సున్నితంబు!
   

నిగ్గదేసి అడగమని జనాల్ని
ఆలోచింపజేసే అద్భుత పదాల్ని
 అవపొసన పట్టావు వేదాల్ని
చూడచక్కని తెలుగు సున్నితంబు!


అక్షరాలతో కవులు పొగిడినారు
నందులతో నిన్ను సత్కరించినారు
అవార్డులతో నిన్ను కీర్తించినారు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

కామెంట్‌లు