సహకారం; -పత్లవత్ వినోద్నేరళ్లపల్లిబాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా

 వెంకటపురంలో భీమయ్య అనే అతను ఉండే వాడు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు. భీమయ్య చాలా పేదవాడు. పని చేస్తేనే  పూట గడిచేది. రోజూ పని దొరికేది కాదు.
 ఒక రోజు పని దొరకలేదని నిరాశతో ఇంటికి వస్తుండగా  దారిలో కాలుకి గాయమై బాధపడుతున్న గుర్రం కనిపించింది. భీమయ్య జాలిపడి గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చాడు.గుర్రం కాలి గాయం మానెేందుకు మందు రాసి కట్టుకట్టాడు. కొన్ని రోజులకు ఆ గాయం పూర్తిగా నయమయింది. గుర్రం భీమయ్యతో "అయ్యా!మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చి రోజూ కడుపునింపారు. గాయన్ని నయం చేశారు. మీకు పనిదొరకకున్నా నాకు ఆహారం పెట్టి మంచిగా చూసుకున్నారు.  
మీ సహాయగుణం వల్లే నేను ఆరోగ్యంగా ఉన్నాను.నేను మీకు సాయపడాలను కుంటున్నాను.నేను ఇప్పటి నుంచి నీ దగ్గర వుంటాను.ఒకబండిని తయారుచేయిం చుకో !నీకు పనిలేనప్పుడు నేను బండితో ప్రయాణికులను తీసుకెడుతూ సంపాదిస్తాను. పెళ్లివేడుకల్లో పెళ్లికుమారుని ఊరేగింపుకూ ఉపయోగపడతాను. మీకూ ఆదాయం వస్తుంది. నాకడుపూ నిండుతుంది"అంది. 
అప్పటి నుంచి భీమయ్య, గుర్రం సహకరించుకుంటూ సంతోషంగా ఉన్నారు.

కామెంట్‌లు