సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 జీవించడం ఓ గొప్ప కళ
********
అందరం జన్మించి ఈ లోకాన్ని చూస్తాం. కానీ ఈ లోకం అబ్బురంగా మనవైపు చూసేట్లు చేసుకొని జీవించడమే ఓ గొప్ప ,అందమైన కళ.
ఆహార విహారాలలో  జీవించే మన వ్యక్తిగత కళ కంటే...
సమాజపరంగా మన నిస్వార్థత,మన ఆశయాలు,ఆలోచనలతో సాగే లక్ష్యాల నిరూపణే.. జీవించే కళకు అబ్బిన గొప్ప మానవతా పరిమళం.
అలా జీవించడమనే కళతో దేదీప్యమానంగా శోభిల్లే వ్యక్తి ఎప్పుడూ  ఈ సమాజంలో చరితార్థుడు మరియు ప్రాతః స్మరణీయుడే.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు