బ్రతుకుబాట ..!!> పెద్దచెల్లి పెళ్లి .కోరాడ నరసింహరావు.>విశాఖపట్నం.

  ------------  18  ---------
అనుభవించిన కష్టాలు... 
ఎదుర్కున్న సమస్యలు... నాకు ఈ జీవితం మీద విరక్తిని కలిగించాయి... !
(18)పద్దెనిమిదేళ్ళ వయసులోనే 
సన్యసించాలనే తలంపు పుట్టింది..మనసులో. !
ఇల్లు,ఊరు,వదిలేసి...కాషాయం కట్టి... దేశమంతా తిరిగి, చివర హిమాలయాలకు చేరుకొని... 
అక్కడి యోగులు, ఋషులతో 
ఉండిపోవాలనిపించింది... !
తల్లి, అభం - శుభం తెలియని 
ముగ్గురుచెల్లెల్లు  ఏమైపోతారో నన్న భయం నన్ను కట్టి పడే సింది... !!
   నేను, నాకుటుంబము నిలద్రొక్కు కోటానికి మూలస్తంభమై 
నిలిచింది మా వేంకటరావు మామయ్యే నన్నది అక్షర సత్యం !
ఆ మనిషి మేలిమి బంగారం, 
మనసు వెన్న !
తనవాళ్ళన్నవాళ్లెవరైనా ఎంతో ప్రేమ, అభిమానం... !చిన్నప్పుడు విజయనగరం నుండి.. బొబ్బిలి వచ్చిన అక్క, పిల్లలు తిరిగి వెళ్లిపోతుంటే... 
ఆ రిక్షా వెంట బావురుమని ఏడుస్తూ పరిగెత్తేవాడు !
అంత మెత్తనైన మనసతనిది !
ఆగస్టు 15. వస్తే చాలు ఆ  రోజుల్లో  రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చెయ్యొచ్చు !
నేను పార్వతీపురం లో రైలెక్కితే... తాను బొబ్బిలిలో నాతో కలిసిపోయేవాడు ఇద్దరం కలిసి విజయనగరంలో తిరిగేవాళ్ళం !
   మా అమ్మ లాగే...పెద్దచెల్లిని  కూడా చిన్నప్పుడు మా మేనమామ తనపెళ్లానికి సాయంకోసమని బొబ్బిలి తీసుకెళ్లే వాడు... !
అక్కడ చెల్లిచేత పనులు చేయిస్తుంటే...పక్కింట్లోనే కదా మా మామయ్యావాళ్ళు ఉండేది.. 
చూసిచాలా బాధ పడేవాడు !
ఇక్కడ మా అమ్మ చిన్నాన్న గారు... అంటే వెంకటరావు గారి నాన్నగారి గురించి కూడా చెప్పాలి !
ఆయనపేరు...ఆబోతుల అయ్యప్ప గారు... చూడటానికి... బొబ్బిలిపులి తాండ్ర పాపారా యునిలా ఉండే వారు ! తాపీ మేస్త్రీ గా హుందాగా ఉండే వారు !
పెద్దకొడుకుని.. బీ ఏ, బీ ఈ డీ 
టీచర్ ను చేసారు ..., రెండో కొడుకుని డిగ్రీ వరకూ చదివిం చారు ... చిన్నకొడుకునిమాత్రం 
పదవతరగతి తోనే పట్టువదిలే శారు...!
ఐ టీ ఐ లో  జాయిన్ చేసేసారు 
అక్కడినుండి మా వెంకటరావు మామయ్య తనబ్రతుకుకు తా నే స్వయంకృషితో బాటలు వేసుకున్నాడు... !
తరువాత...విజయనగరం లోని  ఓ ప్రయివేట్ కంపె నీలో
ఉద్యోగం కూడా సంపాదించు కున్నాడు...!తనకు ఎలాగూ పెళ్లీడు వచ్చింది ఉద్యోగం విజయనగరంలో పెళ్లి చేసేసుకో వాలనే నిర్ణయానికొచ్చి... మా పెద్ద చెల్లిని చేసుకుంటానని వాళ్ళింట్లో చెబితే... మేము పేదవాళ్ళమని అల్లుడి ముద్దూ ముచ్చట్లేవీ చూడలేమని... నిరాకరించినా తనుమాత్రం ససేమిరా అనటంతో... మా తాత.. రెండువేలు కట్నం కావాలన్నారు !.... 
అప్పుడు మాచిన్నగురువు ఆరెండువేలూ బ్యాంకు లోను ఇప్పిస్తే... పెళ్ళికాకముందు కొత్తల్లునిగా ఇంటికి వచ్చిన మా మామయ్యకు మిత్రుడు ధర్మరాజు తెలిసిన బట్టల షాప్ లో జత బట్టలు అరువిప్పిం చాడు !
మొత్తం మీద మిత్రుడు కొంతవరకూ శ్రామికంగా సహకరించాడు... మానివాస గృహం పూరింటి ముందు చిన్న పందిరి వేయగా బoధు,  మిత్రుల సహకారం తో ఆ ఇంటిముందే 
పెళ్ళిజరిగింది !ఇంతగా నేను... అమ్మ, స్నేహితులు యాతన పడితే... నా తండ్రి మాత్రం బ్యాన్డు వాళ్ళను తీసుకువచ్చి నందుకు వాళ్ళకివ్వవలసింది 
తన కమీషన్ తో కలిపి పుచ్చుకున్నాడు.... !!
              ********************
                    ------ సశేషం.....
కామెంట్‌లు