గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 44. "కళ్ళు తెరిపించే క్షణం” లోకపాలకుడైన ప్రభువు అనేక రూపాలలో వ్యక్తమౌతూ ప్రపంచాన్ని అలరిస్తూ వుండటం ఆధ్యాత్మిక పరంగా సహజం. ఇక్కడ భక్తుని కళ్ళు తెరిపించేందుకు ఆయనే స్వయంగా వచ్చి తీరతాడనే వాగ్దాన పరిమళం తన చుట్టూ వ్యాపించి వున్నదని కవి భావిస్తున్నాడు.
వెలుగు నీడలతో నిండిన దారి ప్రక్కన నిలబడి చీకటివెలుగుల ఆటలాడటం, తొలకరి చినుకులను చూస్తుండటం నామనసుకు ఆనందం కలిగించే విషయాలు. అంతు తెలియని ఆకాశం నుంచి వస్తున్న వర్షపు చినుకులు మనకు నూతన సందేశాలను మోసుకొస్తున్న వాహకులని,మనల్ని సంతోషపెట్టి వాటి దారిన అవి వెళ్ళిపోతుంటాయి అని ఠాగూర్ అంటారు. సువాసనలను వెదజల్లుతూ గాలి వెళుతుంది. ఉదయం నుంచి సాయంత్రందాకా నేను నాఇంటి ముందే కూర్చుని నాకళ్ళు తెరిపించే ఆనందమయ సమయం వచ్చితీరుతుందని దానికోసం ఎదురు చూస్తూ వుంటాను. అందాకా నాలోనేను పాట పాడుకుంటూ వుంటాను.

కామెంట్‌లు