స్త్రీ శక్తి ;-నందగిరి రామశేషు-కలం స్నేహం*
 అమ్మాయి అనగానే ఎన్నో జాగ్రత్తలు
అంతూ దరీ లేని బంధనాలు
జైలు వంటి ఇంట్లో వారు బందీలు
కనిపించని బేడీలున్న ఖైదీలు
ఆడదానికి ఎన్నాళ్ళీ కట్టుబాట్లు
ఉద్యోగాలు చేస్తున్నా తప్పని ఇక్కట్లు
తోటి ఉద్యోగులతో పడరాని పాట్లు
ఎప్పటికీ తప్పేను ఈ అగచాట్లు
ఆఫీసులో అధికారితో బాధలు
తనవారితో ఇంట్లో పడే మాటలు
ఎంతచేసినా కారెవరూ సంతుష్టులు
అన్నిటికీ చేసుకోవాలి వీరే సర్దుబాట్లు
తిన్నా తినకున్నా చేయాలి పనులు
కావాలి సమయానికందరికీ అమరింపులు
ఎక్కడేది తక్కువైనా తప్పవు అదిలింపులు
దీనికేనా స్త్రీ స్వాతంత్ర్యపు సంబరాలు!
ఆడది తల్చుకుంటే ఏం చేయలేదు!
తెగిస్తే ఏ‌ బంధనం తనని ఆపలేదు,
ఆదిశక్తిగా అందర్నీ మట్టుపెట్ట గలదు,
అవకాశమిస్తే తానేమిటో నిరూపించ గలదు.

కామెంట్‌లు