దిగులు వెన్నెల;-నెల్లుట్ల సునీత--ఖమ్మం
ఆణిముత్యం లాంటి కలం ఆగింది
కళామతల్లి కన్నీరు పెడుతుంది
సుమధుర గీతాలు ఎన్నో 
ఈ విషాదంలో మీకు  గీతాంజలి ఘటిస్తూ
మౌనంగా రోదిస్తున్నాయి

సమాజాన్ని మేల్కొలిపిన
 సాహితీ శిఖరం నీవు
భాషామతల్లి ఒడిలో ఒరిగిపోయావా
సిరివెన్నెల నీ పాటల పటిమ
భావ గాంభీర్యత
 అక్షరాల అల్లికలు 
 నిత్య అమృతపు జల్లులు
తెలుగునాట  నీ సుజ్ఞాపకాలే
అందరి మనసులో కదలాడే నిత్య వసంతాలే

పదాల కవి  పదాబ్ధి  మదనపు
 ఫలాలను మాకు ఇచ్చి
నిగూఢ  ఆంతర్యపు 
 కవిత్వ రుచులను తెలిపి
ప్రియాతి పదాల గేయాలను 
నేర్పుగా కూర్చి
సిరి వెన్నెలలు కురిపించినావు

చెంభోలు  నుండి
 సిరివెన్నెలగా మారి
కవిత్వ మార్పు కోసం
  సజీవ స్పష్టమైన భావాలు 
జగతికి ఇచ్చి
విశాల సముద్రపు లోతుల్ని తరచి
భాషకు జీవం కవితకు ప్రాణం పోసిన సాహితీ స్ఫూర్తి నీది

మహా కవి అందుకో 
కవిత పద నీరాజనం
 అక్షర గురువుగా మా మదిలో 
కొలువైన నీకు
 కన్నీటి వీడ్కోలు..
 బాధతప్త హృదయంతో 
అశ్రునయనాలతో కవిత నివాళి


కామెంట్‌లు