బ్రతుకుబాట ..!!>యవ్వనపు అలజడులుకోరాడ.నరసింహరావు.>విశాఖపట్నం
 ..........17.......

జీవితం లో  యవ్వనం..... 
ఎంతో ప్రాధాన్యమైనది.. !
ఎవరైనా... సరియైన బ్రతుకు బాటలు వేసుకునేది యవ్వనం లోనే... !ఇది జీవితానికెంత ప్రాధాన్యమైనదో... అంత ప్రమాదమైనది... !
కామ, క్రోధ, లోభ, మోహ, మద 
మాత్సర్యాది అరిషడ్వార్గాలలో 
కామమే అతిశక్తివంతమైనది...
కామంతో మనిషి ఓడిపోతే... 
మరింత మొహానికిగురైపోయి., క్రోధిగామారిపోతాడు,మాత్సర్యం తో లోభిగామారతాడు !
ఆ కామ కోరికలు తీరినా... 
మదంతో... మరిన్ని కోరికలలో 
మునిగిపోయి...అందుండి బయట పడలేక సర్వనాశనమై పోతాడు... !
అంత ప్రమాదకరమైనదీ' కామం '
ఈ కామానికి  విశ్వామిత్రుడంతటి మహర్షియే ముప్పుతిప్పలు 
పడ్డాడు.,ఇంక..సామాన్యమానవ మాత్రుల సంగతి చెప్పాలా!?
 యవ్వనం వంద పిచ్చెక్కిన కోతులతో సమానమని... 
ఓ మహానుభావుడు చెప్పినది..
అక్షరాలా సత్యమే  అని నా అనుభవం చెబుతోంది... !
"కామాతురాణాం నభయం,న లజ్జా " ఇది ఆర్యుల వాక్కు !
అందుకుభిన్నంగా..ఆ భయము
లజ్జలే నన్ను కొంతవరకూ కాపా డ గలిగాయని చెప్పగలను.. !
నాలో... 15 వ ఏడు ప్రవేశం తోనే...యవ్వనపు అలజడులు అల్లరిచెయ్యటం మొదలయిన్ది!
ఆడగాలి తగిలితే చాలు... పువ్వు చుట్టూ భ్రమరం పదే - పదే తిరిగినట్టు... తలుపులన్నీ అటువైపే...గానీ... అనేకరకాల భయాలు... అబాసుపాలై పోతానేమో  నన్న భయంతో కూడిన లజ్జ...వెనక్కు లాగేసేవి 
ఐనా... యవ్వనం కనికరించదు  గా... పిచ్చెత్తించేసేది... దీనికి తోడు... సంఘటనానుభవాలు 
అప్పట్లో... సినిమాలకు నేల, బెంచి, కుర్చీ, బాల్కనీ లుగా ఉన్నా మొదట్లో నేల టిక్కెట్ అమ్మతోవెళ్ళేటప్పుడు పావలా గా ఉన్న నెలటిక్కెట్టు నా పది  హేనేళ్ళ వయసుకి...అర్ధరూపా యయింది నేను మొదట్లో నేల, తరువాత బెంచి... అలా... డబ్బులకు లోటులేని రోజుల్లో బాల్కనీకి కూడా వెళ్ళేవాడిని 
బాల్కనీలో అంతా... డాక్టర్లు, 
లాయర్లు పెద్ద - పెద్ద వ్యాపా రస్తుల మధ్య కూచోటానికి చాలా బిడియపడే వాడిని.. !
అందుకే అనుంటారు... !
కాసులు గలవాడే రాజు అని... 
ఏదీలేకపోయినా డబ్బుంటే చాలు అని నాకప్పుడర్ధమైంది. 
ఐతే... అసలు విషయానికొస్తే 
కొందరు.. హోమో, లెస్బియన్ 
లాంటి వారుంటారు !అటునంటి వాళ్లకి ఈ సినిమా హాల్లే మంచి అవకాశం... !
వాళ్ళ కళ్ళు మంచి పరువాని కొస్తున్న యువకులను వెదుకుతై  
వచ్చి ఆమసకచీకట్లో పక్కన కూచుంటారు... సినిమాలో మాంచి సీన్ లో ఉన్న సందర్భం చూసుకుని మెల్లగా చెయ్యి వేస్తారు...ఆస్పర్శఆవయసులో 
ఓకొత్త అనుభూతి... మనసు ప్రతిఘటించ నివ్వదు... !
ఒంట్లో వేడంతా దిగిపోయి... 
శరీరము, మనసు తేలికై పోతుంది... !
ఈ అనుభవానికి నేనూ ఓ రెండుమార్లుగురైనా...పర్యవసానాలను ఊహించి... మేల్కొన్నాను ! మళ్ళీ అలాంటి అవకాశం ఇంకెవ్వరికీ ఇవ్వలేదు
గానీ...ఆ సుఖానికి మాత్రం.... వస్యుడనైపోయాను !
   ఆ బలహీనత నన్నెంత వరకూ  తీసుకెళ్లింది  అంటే... 
స్వయంతృప్తి తో ఆ  సుఖాన్ని 
పొందని రోజుండేది కాదు !!
అదెంత తీవ్ర స్థాయికి వెళ్లిందీ అంటే... ఒంట్లో ఒక్కచుక్క కూడా మిగలకుండా మొత్తం బయటికి పంపించేటంత !!
                    ******************
                     --------  సశేషం  -------

కామెంట్‌లు