**అక్షర రోదన**;-**సాగర్ రెడ్డి****చెన్నై**
కాగితాలు రోదిస్తున్నాయి
అక్షర ముత్యాలు అదృశ్యమై,
అక్షరాలు కలవరపడుతున్నాయి
మూడు దశాబ్ధాలుగ కదలించిన  కలం కానరాక-
పాటల ప్రపంచం నివ్వెరపోయింది
అక్షరఙ్ఞాని అస్తమయంతో!!

పేరులోనే సిరిని, వెన్నెలను
అంటిపెట్టుకున్న అక్షరఙ్ఞానికి 
తాను వ్రాసే పాటే ఒక సిరి.
పాటతో పయనించి అలరించే
 అపురూప భావనే వెన్నెల
అక్షరఙ్ఞాని అస్తమించినా
ఆయన పాట అజరామరం!!

పాటసారి  దివికేగిన
పదనాలుగు మాసాలకే 
 నేనుసైతం అన్నాడు-
పాటసారికి తోడుగా 
గగనసిగలో వెన్నెలై
అభిమానుల ఎదలో 
అమావాస్యను సృష్టించాడు-
పాటను వదలి పరలోకవాసిగా అదృశ్యమయ్యాడు!!

 అక్షరఙ్ఞానిభౌతికరూపం
అందనంత దూరమైనా,
పాటకుపట్టంకట్టిన
 ఆయన ప్రతిభ అసమాన్యం.
 అది సాహితీ సౌరభాలను
 వెదజల్లే సంగీత సుగంధం!!


కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
మీ కవిత బాగుంది
అభినందనలు సాగర్.