బ్రతుకు బాట :- ;ఎంత గొప్పవారైతేనేమి..... వ్యసనానికి బానిసైతే.... !కోరాడ నరసింహా రావు.

  ***   35   ***
కాలం ఏ ఒక్కరికోసమూ ఆగదు కదా... ! మా వివాహమైన పదకొండు నెలలకే 
పూర్తిగా నెలలు నిండకుండా నే 
(ఏడోనెలలోనే...మాయావిడకు 
మోషన్ లో రక్తం పడటం... ఆ లేడీ డాక్టర్ కు మాయావిడ తెలివితక్కువ తనంతో బ్లెడ్  బ్లీడింగువుతోందని చెప్పటం ఆవిడేవోమందులుఇవ్వటంతో )..పాప పుట్టిందినెలలుతక్కువ 
పైగా ఎదురు కాళ్లతో.. పాదాలు రెండూ ముఖానికి తాకుతూ... 
పుట్టటంతో... బ్రతకదన్న  అనుమానం తో పదకొండు నెలల వరకూ బారసాల చెయ్య లేదు... పేరుపెట్టలేదు...! ఐతే 
మా అమ్మ రోజూ నలుగు పెట్టి కాపే విధానంతో... చచ్చిపో తుందనుకున్న దల్లా... చక్కగా
తయారైపోయింది !
మరో ఆరు మాసాల్లోనే మళ్ళీ 
మాయావిడ నెల తప్పటం తో 
ఈ మారు బాబు పుట్టాలని ఎంతో ఆశతో ఎదురు చూసిన మాకు నిరాశే ఎదురైంది !
ఇంక పిల్లలు చాలు అనుకుంటే 
ఇటు మా అమ్మా ఒప్పుకోలేదు 
అటు మా అత్తవారు... మా అత్త, వాళ్ళమ్మకి ఏకైక కూతురు మగ  పిల్లలు లేరు 
అత్తగారి పెద్దకూతురికీ... ఇద్దరాడపిల్లలే...మాకైనా బాబు పుడతాడని ఆశ పడితే 
వరుసగాఇద్దరాడపిల్లలైపోయారు... !
అటు, ఇటు కూడా మూడో సంతానాన్ని చూద్దామనటం నాకు కూడా మూడోసారైనా బాబు పుట్టొచ్చనే చిన్న ఆశ.... 
నాకు ముగ్గురూ ఆడపిల్లలే రాసిపెట్టుంటే... బాబెలా పుడ తాడు... !!
     మాఇల్లు చాలా చిన్నది !
ఒకే ఒక్క చిన్నగది ముందుకి చిన్న గడప, వెనుక వంటగది చిన్న బాత్రూం, లెట్రిన్.. ఇంతే 
ఆ కాస్త ఇంట్లోనే నేను, భార్య... 
ముగ్గురు పిల్లలు, అమ్మ, నాన్న 
చిన్నచెల్లి...(అప్పటికి మాతమ్ముడు రెండో పెళ్లి చేసుకుని వేరే ఇంట్లో ఉంటున్నాడు ) ఇందరం ఇరుక్కొని ఉంటే... విజయనగరం... నాకు సంబంధం చూసిన పిన్ని వాళ్ళాయనకు శ్రీకాకులనుండి 
మున్సిపలాఫీస్ మేనేజర్ గా ప్రమోషన్తో... మా పార్వతీపురం వచ్చారు !
మంచి జీతం... గీతంకూడా బాగానే వస్తుంది, వేరే మంచి ఇల్లు అద్దెకు తీసుకుని ఉండొచ్చుకదా... ! వాళ్ళుకూడా 
మాఇంటిలోనే తిష్ట వేశారు... !
మా పిన్ని భర్త... చిన్నాన్న గారు 
O r k...అంటే ఒమ్మి రామకృష్ణ
గారు విజయనగరంలో మంచి పేరున్న వ్యక్తి... బుర్రకధలో గొప్ప పేరున్న కుమ్మరిమాష్టా రి 
తోనూ... ఆంద్ర జాలరి సంపత్ కుమార్తోనూమంచిమిత్రుత్వం 
ఉండేది...పోలీసుఅధికారులు 
రాజకీయ నాయకుల దగ్గర మంచి పలుకుబడి ఉండేది... !
ఎన్ని గొప్పతనాలున్నా... మద్యపానం మనుషుల్ని పూర్తిగా దిగజార్చేసి పరువు, మర్యాదల్ని నాశనం చేసేస్తుంది అనటానికి మా o r k... గారే గొప్ప ఉదాహరణ !!
ఆ ఇరుకు ఇంటిలో అన్ని ఇబ్బందులు పడుతున్నా... 
.అలాగే ఉంటోంది... మాపిన్ని సెలయే టప్పటికి మొత్తం జీతమంతా విజయనగరం పట్టుకు పోయేది ! ఆఖరికి అలా ఇబ్బందులు పడలేక... 
ఇంక మీరు ఇల్లుచూసుకుని వెళిపోతే బాగుంటుంది.. ఇలా అందరం ఇబ్బంది పడేకన్నా... 
అని అన్నతరువాత... ఇంక తప్పదని... ఓ ఇల్లుచూసుకుని 
వాళ్ళు వెళ్ళిపోవటం... వెళ్లిన కొద్దీ నెలల్లోనే... మరో నెలో... 
రెండునెలల్లోనో  చిన్నాన్న రిటైర్ ఐపోతారనగా సీరియస్ చేసి 
చనిపోవటంతో... ఉద్యోగస్తుడవుతాడని జన్మలో ఊహించని వాళ్ళ పెద్దకొడుకు 
ఉద్యోగస్తుడైపోయాడు... !
తండ్రి చావు వాడి బ్రతుకకొచ్చిందని చుట్టాలు, బంధువులూ అందరూ అనుకున్నారు !!
    *******
  **  సశేషం   **
కామెంట్‌లు