సమస్య:-మందిని ముంచిన మనుజుడె మహనీయుండౌ-సాహితీసింధు సరళ గున్నాల
కం*ఎందరుప్రక్కనయున్నను
సుందరిప్రేమందుకొనగ ,చురచుర చూపున్
నిందలువేయుచు పొరుగును ,
మందిని ముంచిన మనుజుడె మహనీయుండౌ

కం*చిందిన ప్రేమసుధాంబుధి
వందితమౌ కరము గొనగ భయమునువీడన్
నందరినెదిరించి నడిచి
మందిని ముంచిన మనుజుడె మహనీయుండౌ

కందమురాయుచు నందున
సుందరభావమ్ముగొనుచు ,శుభగణములకై
అందరిమదినిట ద్రిప్పగ
మందినిముంచిన మనుజుడె మహనీయుండౌ

పందెమువేయగ మిత్రుడు
చిందినమధురపు రుచులకు జిల్లన మనమున్
అందినకాడికి గుడుచుచు
మందిని ముంచిన మనుజుడు మహనీయుండౌ

కొందరు దోపిడి జేయగ
సందింతయు దొరకబుచ్చి సంపాదననే
అందినకాడికి పంచుచు
మందిని ముంచిన మనుజుడు మహనీయుండౌ

బంధమునిలుపుట కొరకై
రంధినితాబాపజూచి రసరస వీడన్
అంధుడు నల్లుడు మురియగ
మందినిముంచిన మనుజుడు మహనీయుండౌ

కామెంట్‌లు