తెలుగు జాతీయాలు.;-పెద్ద పులి చూపు.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 పెద్దపులి ఒక క్రూర ఆటవిక జంతు వు. చాలా ప్రమాదకరమైనది. ఇది పిల్లి జాతికి చెందినది. ఈ జాతి జీవులన్నీ చీకటిలో చూడగలుగుతాయి. పిల్లి కన్నులు ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ సామర్ధ్యము చీకటిలో ఉండదు. జంతువులకు పక్షులకు మాత్రమే వర్తిస్తుంది. పెద్దపులి చూపులు మరో ప్రత్యేకత ఉంది. మన వైపు చూస్తున్నపుడు దాని వైపు చూడటం చాలా కష్టం. దీని చూపులో తీవ్రతే కాక ఏదో ఒక ఆకర్షణ శక్తి ఉంటుందంటారు వేటగాళ్ళు. జిమ్ కార్బెట్, ధనగోపాల్ ముఖర్జీ వంటి గొప్ప వేటగాళ్లు పులి కంట్లో కన్నుల వేసి చూడటం కష్టం అంటున్నారు. చూచిన ఆ చూపులు మళ్ళించడం కష్టతరం. దాని చూపును భరించుట తరం కానిది. అది మన వైపు చూస్తున్నప్పుడు మనం చూపు మళ్లీంచామనుకో అది ఆ క్షణంలోనే మన వెంట పడుతుంది. అందువల్ల పులిని వేటాడేవారు దానికి ఎదురుగా చూచి వేటాడలేరు. దాని వెనక నుండి గాని పక్క నుండి గాని వేటాడుతారు. ఇది ఇది అనుభవజ్ఞులు చెప్పిన సత్యం.
మనుషుల్లో కొందరి చూపులో ఓ రకమైన ఆకర్షణ తీవ్రత కనిపిస్తాయి. ఎదుట నిలిచిన వారు చూపు మర లిస్తే తే వానిలోని లోపాలను అంటే పసిగట్టే వారిది పెద్దపులి చూపే. తప్పు చేసిన వ్యక్తి ఎదుటివారి ముఖంలోకి నేరుగా చూడలేడు. పెద్ద పులి చూపు భయంకరం. ఆ చూపు గలవాడు మహా ధైర్యవంతుడు, ఆలోచనాపరుడు, కడు జాగ్రత్త కలవాడు. మరియు పరిశోధకుడు. అంతేకాదు వాడు భయంకరుడు, ప్రమాదమైన వాడు అని కూడా అంటారు. పెద్ద పులి చూపు అంటే ఇదేనా అని గ్రహించాలి
కామెంట్‌లు