అరుణరాగం ....!!>ఆన్షీలు>డా.కె.ఎల్.వి.ప్రసాద్>హన్మకొండ.

 కొత్తసంవత్సరం అనగానే జనవరి గుర్తుకొచ్చును ,
విశ్వవ్యాప్తమైన పండుగ గా గుర్తింపు కదా దీనికి ,
సంవత్సరాది'ఉగాది' తెలుగువారికే పరిమితమయ్యే 
వినుము  కెఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
---------------------------------------------
వచ్చినట్టే వచ్చి వెళ్లిపోతుంది వచ్చినంత వేగంగా ,
మాయదారి సంవత్సరం రెండువేల ఇరవైఒకటి ..
కరోనా కాకతో కన్నీళ్లు రప్పించి హడలుగొట్టింది కదా!
వినుము కెఎల్వీ. మాట  నిజము సుమ్ము....!!
-----------------------------------------------
 రెక్కలొచ్చువరకు పక్షులకు తల్లి యే ఆధారము ....
రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోవు స్వంత గూడుకొరకు ,
తల్లిపక్షి దీనిలో తప్పు వెతుకుట మేలుకాదు గదా !
వినుము  కెఎల్వీ.మాట నిజము సుమ్ము....!!
-----------------------------------------------
అన్నింటికి 'ఆదార్ ' లింకు అంటారు  అదికారులు ...
అంతా మనమంచికేనని మురిసిపోతాం మనం ..!
ఓటుకెందుకు చేయరో కదా ..!మరి ఈ ఆదార్ లింకు
వినుము కె.ఎల్వీ. మాట నిజము సుమ్ము ...!!
----------------------------------------------

కామెంట్‌లు