గీతాంజలి ; రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
 42. “ నావ ఎప్పుడు సాగరాన సాగిపోతుందో? "
తెల్లవారకమునుపె గుసగుసల చెవిసోకె, నువ్వూనేనూ పడవయాత్రకు చననుంటిమని, ప్రపంచాన మరే ప్రాణికి ఎరుకలేని ఈ యాత్ర ఎరుగనైతి దరికానని ఏ ప్రపంచతీరానికో....
అవధిలేని సముద్రాన మందహాస మౌనంలో చెవియొగ్గి నీవినగ మాటల శృంఖలాలదురిమి 'నాగానం' అలల లయల స్వేచ్ఛారాగాల నల్లు తరుణమింకా రాలేదా? చేయదగిన పనులింకను
మిగిలిపోయివుండెనా? పుడమి ఒడిని వాలిపోవు నెర్రబారి సంధ్యకాంతి, మసక వెలుగుమాటులోన పక్షులన్ని గూళ్ళుజేర పయనమాయె రెక్కలిప్పి చిట్టచివరి సూర్యకాంతి రేయిలోకి జారురీతి నాబంధం విడిపోయి నావెప్పుడు సాగరాన సాగిపోవుయాత్రకై?


కామెంట్‌లు