రహదారి;-సంధ్యా శ్రీనివాస్;-కలం స్నేహం
రహదారిని నేను
అందరికీ దారి చూపుతూ
మరెందరికో ఆధారమౌతాను
అలుపన్నదే ఎరుగను నేను
విశ్రాంతి అనేదే తెలియదు నాకు
రేయింబవళ్ళు నా గుండా ఎందరో
పయనిస్తూనే ఉన్నారు 
వారి వారి గమ్యస్థానానికి చేయుటకై

అందరూ సమానమే నాకు
పాదచారులైనా, సైకిల్ చోదకులైనా సమానమే నాకు
ఆటోలో నిండుగా జనాలతో నింపుకొని వెళ్లినా 
బండరాళ్లను నింపుకొని వెళుతున్న లారీలైనా 
బడుగు జీవుల రవాణా మార్గం
బస్సు లో ప్రయణించినా
అందరూ ఒకటే నాకు
భేదాలే ఉండవు నాకసలు
ఇంత ఓపికతో ఉన్నా ఒక్కోసారి
నాపై నెత్తుటేరులు పారుతూనే ఉంటాయి అప్పుడప్పుడూ

అతివేగం వద్దని ఎన్ని స్పీడ్ బ్రేకులు పెట్టినా
ఆగడమే లేదు కొందరు చాలా వేగంగా పయనిస్తూ
ఎన్నో ప్రమాదాలు కొనితెచ్చుకుంటూనే ఉన్నారు
వారి స్వయంకృతాపరాధంతో....
ఏం చేయను నేను
ఎంతని చెప్పను నేను
బాధపడడం తప్ప...


కామెంట్‌లు