ఋతువుల రగడ (బాలలకథ)( "రాజశ్రీ" కవితా ప్రక్రియలో);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
1)
నేను వసంతాల సంతసాన్ని
ప్రకృతి మాతకు హారాన్ని
నేను మధువులు చిందిస్తా
నన్ను మధుమాసం అనిపిస్తా!
2)
మావి చిగురుల మంతనాలు
పూల తోటల పులకరింతలు
ఇట కోయిలల సుస్వరాలకు
యువత జంటల వినోదాలకు!
3)
చంచరీకముల సంచార ధ్వనులు
ఝమ్మని సాగే సంగీతాలు
మంగళ వాద్యాల నాదాలకు
మాంగల్య ధారణ శ్లోకాలకు!
4)
ఇది పచ్చదనాల విలాసాలకు
మనసునవూరే తీయని కలలకు
సుస్వర వేణుగానమే నాదికదా
ఆరంభ శ్రీకారమే నేనుకదా!
5)
అన్నింటికీ నేనే మూలం
నాకు మించి లేదేకాలం
అందుకే అంటున్నా నేనేగొప్పా
అలా అనడం తప్పా?
(సశేషము)


కామెంట్‌లు