ఆత్మ ప్రబోధ మాలిక ఆవిష్కరణ


 ఆత్మ ప్రబోధ మాలిక ఆవిష్కరణ రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన మురారి పంతులు విరచితమైన ఆత్మ ప్రబోధ మాలిక అను పద్య పుస్తకం జిల్లా గ్రంథాలయంలో 11 గంటలకు చైర్మన్ ఆకునూరి శంకరయ్య సాహితీ మిత్రుల మధ్య ఘనంగా ఆవిష్కరించారు. ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ మురారి పంతులు రెండో పుస్తకం గ్రంథాలయంలో ఆవిష్కరణ ముదావహం, కరోన రోగం పై పద్యాలు కంటతడి పెట్టించాయ న్నారు. సభాధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య సమీక్షిస్తూ ఆత్మ ప్రబోధం పద్యకావ్యం భవిష్యత్ పురాణంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం అంశాలను, సీస పద్యాల్లో పొడిగించడం శరీరానికి ఆత్మకు ఉన్న అనుబంధాన్ని చక్కగా వివరించడం జరిగింద న్నారు. గౌరవాధ్యక్షులు పోరండ్ల మురళీధర్ ముదిమి వయసులో 20 పుస్తకాలు పుస్తకాలు రాయడం విశేషం అన్నారు. కందేపి రాణి ప్రసాద్, ఇది ఆధ్యాత్మిక చింతనకు బాగుందన్నారు. మురళీధర్ శర్మ ఎంపీడీవో, వాసరవేణి పరశురాం ముసలితనం లో ఉన్నటువంటి అవస్థలను పద్యరూపంలో మన ముందుంచడం చక్కగా రక్తి కట్టించారు.కోడం నారాయణ, లక్ష్మి నారాయణ ,వెంకట రెడ్డి, సంగీతం సత్యనారాయణ పని లక్ష్యం రామకృష్ణ వీరు కవితా గానం చేశారు. గజ్జల రామచంద్రం, రమేష్ దామోదర్ సుమారు 35 మంది కవులు పాల్గొన్నారు.సభ ప్రారంభం లో సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణానికి మౌనం పాటించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


కామెంట్‌లు