మదిలో మెదిలే ;-దేవి గాయత్రి;- కలం స్నేహం
ఆలోచన లు

ఆలోచనల అరణ్యంలో .
ఒక్కో జ్ఞాపకం ఒక్క ఆలోచన
గుండెంతా నిండినట్లుంది..
అక్షరాల కందని భావోద్వేగాలు..
ఏవేవో మదిలో ముసురుకుంటున్నాయి .
మురికి పట్టిన లోకాన్నే బూజు దులుపు దామని
ఆచారం పేరుతో అన్యాయం జరుగుతూ ఉంటే
చూస్తున్న ఈ జనానికి అగ్ని స్నానం
చేయించాలని..కపట ప్రేమల తలుపులు
ముయించాలని ..
అనుభూతికి మించిన ఆచారం లేదని
సంతృప్తి కి మించిన సాంప్రదాయం
లేవని.. 
అవి  జీవిత  అనుభవ సారమని
ఆలోచనపు అంచుల్లో
మదిలో జరిగే మదనంలో..
అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలాయి ఉన్నాయి..


కామెంట్‌లు