పెళ్లినాటి ప్రమాణాలు;-ఇందిర తుంగ;-కలం స్నేహం
పెళ్లంటే నూరేళ్ళపంట.. అంటూ
ఇద్దరు యువతీ యువకులను
సరిజోడీ అని జతచేసి, ఇరువైపులవారు ఆనందోత్సాహాలతో పెళ్లి ఘట్టాన్ని
జరిపించి గృహస్తాశ్రమం ఆచరించమని దీవిస్తారు..

మరి ఈపెళ్లినాటి బాసలు ఏ గాలికి
ఎగిరి పోతున్నాయో...
ఏ దురాశాలకు బలి ఐపోతున్నాయోకానీ పచ్చగా
ఉండాల్సిన సంసారాలు
నిస్సారమై
ఎవరికి వారే యమునా తీరే 
ఐపోతున్నారు..

అందమైన భవిష్యత్తును
అధోగతిపాలు చేసేసుకుంటూ,
అందరిలో నుగుబాటు అవుతూ,
కన్నవారికి కంటిపై కునుకులేకుండా
చేస్తూ, 
ఎందరెందరో ఒంటరి ప్రయాణానికి
సంసిద్దులై పోతున్నారు...

అగ్నిసాక్షిగా పెళ్లాడిన
జీవిత భాగస్వామిని అపార్ధాలతో
నిందించక,
దురుద్దేశంతో ఆలోచించక,
కొంచెం సర్దుకుపోతూ,
చక్కని జీవన ప్రయాణాన్ని సాగిస్తే
అందరికీ ఆనందమయమే..


కామెంట్‌లు