సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
 ప్రతికూలత
*******
ప్రతికూలత అంటే మరేంటో కాదు. అననుకూలమైన పరిస్థితి. విరుద్దమైన, వ్యతిరేక భావాలతో కూడిన శత్రుత్వం లాంటిది.
ప్రతికూలతను ఎదుర్కొనే వ్యక్తికి దానిని భరించడం చాలా కష్టంగా ఉంటుంది.
కానీ ప్రతికూలతను నిబ్బరంగా,ఆత్మ విశ్వాసంతో ఎదుర్కోవడంలోనే వ్యక్తి యొక్క సహనం,విజ్ఞత బయటపడుతుంది.
ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లోనే మనకోసం ఆలోచించే స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరో తెలుస్తుంది. ఎన్నో అనుభవాల పాఠాలను నేర్పుతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏

కామెంట్‌లు