తెలుగు జాతీయాలు.--ససేమిరా.--తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఈ మాట సంస్కృతంలో పంచతంత్రం లోనిది. దూబగుంట నారాయణ కవి.బైతరాజు వేంకటనాథుడు అనుసరించిన పంచతంత్రంలో ఒక కథ ఉంది.
ఒక రాజకుమారుడు షికారు కోసం వస్తాడు. అడవిలో తిరుగుతూ ఉంటే ఒక పెద్ద పులి వారిని తరుముతుంది. పులి భయానికి వాడు త్వరపడి ఒక చెట్టు ఎక్కుతాడు. ఆ చెట్టుపై వీడికి కూర్చున్న కొమ్మ కు మరో కొమ్మ మా పక్కనే ఒక భల్లూకం ఉంటుంది. దానిని చూచి ఆ కుర్రవాడు గజా వణికి పోతున్నాడు. అయితే ఆ భల్లూకం ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పి నీకు ప్రాణభయం లేదు అంటుంది. చెట్టు కింద పులి తిరుగుతూ ఉంటుంది. కొమ్మపై భల్లూకం నిద్రలోకి జారుకుంటుంది. ఈ రాజకుమారుడికి తినడానికి పళ్ళు కూడా ఇస్తుంది. కిందనున్న పులి ఓ యు రాజా ఈ భల్లూకము కిందకి తోసేయ్యి నా ఆకలి తీర్చుకుంటాను నిన్ను విడిచి పెడతాను అని అంటుంది. భల్లూకం చేసిన మేలు మరచిపోయి ఆ ఎలుగును కిందికి తోస్తాడు. ఆఎలుగు దగ్గర ఉన్న కొమ్మను పట్టుకొని వేలాడుతూ పైకి వస్తుంది. నీవు కృతఘ్నుడు. చేసిన మేలు మరిచావు. కాబట్టి నీవు పూర్వజ్ఞానం కోల్ పోదువుగాక అని శాపమిచ్చి కొంతసేపటికి కరుణతోఈ ససేమిరా అక్షరాలకు అర్థం వినగానే మీ యధా స్థితికి రాగలవు అంటుంది. పులి కొంతసేపటికి సడి చేయకుండా వెళ్లిపోతుంది.
రాజకుమారుడు వేటకు వెళ్లి ఇంకా రాలేదని భటులను పంపి వెతికి ఇస్తారు. రాజకుమారుడు ఎదురు చూపులతో ససేమిరా అంటూ ఉంటాడు. వారిని రాజు వద్దకు తీసుకు వస్తారు ఇక్కడ కూడా బెదురు చూపులు. ఏది అడిగినా ససేమిరా అంటాడు. రాజుకు బుర్ర తిరిగి పోతుంది. మంత్ర అ తంత్ర అ తాత్విక మానసిక వైద్యులను పిలిపించి వైద్యం చేయిస్తారు. అయినా ససేమిరా అనే ధ్వని తప్ప మరో ధ్వని లేదు. ఈ దుస్థితి నుంచి ఎవరెన్ని ప్రయత్నాలు చేసి కాపాడాలని అనుకున్న అవన్నీ వృధా అయిపోతాయి. చివరికి మరణదండన విధించగా తప్పించుకొని రహస్య జీవితం గడుపుతున్న మంత్రిని పిలిపించు తాడు. మంత్రి అడవి లో జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తూ ఉంటే రాజకుమారుడు ఒక్కొక్క అక్షరాన్ని విడిచి పెడుతూ ఉంటాడు. సే మీరా, మిరా, రా, అంటూ ససేమిరా ను వదిలిపెట్టి మామూలు మనిషి అవుతాడు. ఎవరేమి చెప్పినా సరే రే మొండివాని ని సంబోధించాడు. ససేమిరా వినండి అని అంటారు. వినిపించుకోవడం లేదన్న అర్థంలో ఈ జాతీయం స్థిరపడింది.
కామెంట్‌లు