మావల్ల కానిది....!!;-- యామిజాల జగదీశ్
 అది 1937వ సంవత్సరం. 
తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజాజీ ఉన్న కాలమది.
తన కార్యాలయ సిబ్బందిలో ఒకరిని పిలిచి ఒక కవరు ఇచ్చి దానికి పోస్టల్ స్టాంప్ అతికించి తెమ్మన్నారు రాజాజీ.
ఆ ఉద్యోగి సరేనని ఆ కవర్ అందుకుని కాస్సేపటికి స్టాంప్ అతికించి తీసుకొచ్చి రాజాజీకి ఇచ్చాడు. 
అది తీసుకున్న రాజాజీకి నవ్వాగలేదు.
"ఏంటీ , మేమందరం కలసి బ్రిటీష్ చక్రవర్తిని తలకిందులు చేయడానికి నానా తంటాలు పడుతున్నాం. ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా ఏవీ కలిసిరావడం లేదు. కానీ నువ్వు క్షణంలో ఆ పని చేయగలిగావుగా" అన్నారు రాజాజీ.
ఆయనెందుకు అలా చెప్పారో ఆ ఉద్యోగికి అర్థంకాక తెల్లబోయి చూసాడు. 
అప్పుడు రాజాజీ కవరుమీద తలకిందులుగా అతికించిన స్టాంపుని  చూపించగా అతనికి విషయం బోధపడింది. 
ఇంతకూ ఆ ఉద్యిగి తలకిందులుగా అతికించిన స్టాంపులో ఉన్నది మరెవరో కాదు సాక్షాత్తూ ఇంగ్లీష్ చక్రవర్తి బొమ్మ!!

కామెంట్‌లు