మిసిమి ముచ్చట్లు..!!(మాటలు:ఆన్షి, రాతలు: కెఎల్వీ)
 పుస్తకం తీస్తానా..
వద్దు..వద్దంటారు
మా..  తాత...!
చదవడం 
నాకు రాదని....
పుస్తకం 
నలిగ పోతుందని
మా..తాత ఉద్దేశ్యం!
అక్షరాలు 
చదవలేకపోయినా
బొమ్మ లు...
చూడ(చదవ)గలను!
అందుకేనేమో...
తాత అర్థం చేసుకుని
ఆలకిస్తారు-
నాచేష్టలు....
నేను -----
తెలుగునేర్చుకోవాలని,
ఆయన ఆశలు....!
అది నెరవేరాలని
మా..పెద్ద తాత(మధు)
హృదయపూర్వక---
ఆ    శీ     స్సు     లు.....!!
               ***

కామెంట్‌లు