తాండూర్ చిన్నారికి– భ‌గవ‌ద్గీత పోటీలో బంగారు పత‌కం;- వెంకట్ మొలక ప్రతినిది:వికారాబాద్ జిల్లా


 700 శ్లోకాల కంఠ‌స్థంలో ప్ర‌తిభ
,భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్థ పోటీలో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచిన తాండూరుకు చెందిన తెలుగు మోక్ష అనే చిన్నారి భ‌ళా అనిపించుకుంది. మైసూర్ అవధూత దత్తపీఠం వారు ప్ర‌తి యేడాది మాదిరిగానే భ‌గ‌వ‌ద్గీత కంఠ‌స్ధ పోటీలు నిర్వ‌హించింది. ఈ నెల‌ డిసెంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలో తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి చెందిన తెలుగు మహేందర్(ప్రభుత్వ జూనియర్ కళాశారీ లెక్చరర్) కూతురు తెలుగు మోక్ష పాల్గొంది. 20వేల మందికి జ‌రిగిన పోటీల‌లో 2వేల మందిని ఎంపిక చేయ‌గా అందులో తెలుగు మోక్ష చోటు సంపాందించుకుంది. ఈ పోటీలో 700 శ్లోకాలు కంఠస్థం చేసి ఫైనల్‌కు చేరుకుంది.
వాక్కు, ఉచ్చారణ, జ్ఞాపకశక్తి విభాగాలలో మోక్ష ప్రతిభ కనబరచడంతో మైసూర్ దత్తపీఠం వారు బంగారు పథకానికి ఎంపిక చేశారు. అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా చిన్నారి మోక్షకు బంగారు పతకంతో పాటు ప్రశంస పత్రాన్ని అందజేశారు. తాండూరుకు చెందిన చిన్నారి మోక్ష భగవద్గీత పోటీలో బంగారు పతకం సాధించడం పట్లు పలువురు అభినందించారు. మరోవైపు తమ కూతురు పోటీలో అందరి మెప్పు పొందడం పట్ల మ‌హేంద‌ర్, కుటుంబ స‌భ్యులు సంతోషం వ్యక్తం చేసి నారు
కామెంట్‌లు