మగువా ఓ మగువా;-అరుణ భట్టువార్;- కలం స్నేహం
తరాలు మారినా యుగాలు గడిచినా..
జరుగుతోంది మగువల బలిదానం...
అన్యాయం ఇది జాతికి 
అవమానం

దురాచార పిశాచాల నీడలలో
కిరాతకుల ఘాతుకాల
పీడనలో.....
కన్నీళ్ళలో ఖైదీగా కుంగుతోంది.
బానిసల బంధీయై...
 బతుకుతోంది.

సాంప్రదాయ సమాధుల గోడలలో....
మోడు లైన ఎడారుల 
బీడులలో..
ఆత్మ లేక దేహంతో పడి ఉంది
దిక్కులేక శూన్యంలో నిలుచుంది.

పతి పేరిట చితిమంటల సహగమనం..
కొనఊపిరితో నరకానికే
ఆ ...పయనం.
వరకట్నపు ఉరితాడులు
కోరెను ప్రాణం.
సజీవంగా చేస్తారు రీదహణం.

మగవారికి ఏమో బహు భార్యలు.
భర్త లేకపోతే భార్యలేమొ విధవలు.


కామెంట్‌లు