తాత - మనవడు (కథ)("రాజశ్రీ" కవితా ప్రక్రియలో);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 1)
తాత మనుమలు ఒకసారి
జతగా పయనించిరి ఒకతూరి
గాడిదతో బాటు వారు
నడక వదలి పోరు!
2)
లోకులు వీరిని చూసినారు
ఎంతవింత అని నగినారు
గాడిద వ్యర్థము మరి
ఇద్దరు నడిచిన తరి!
3)
మనము ఎపుడు కనలేదు
మనము ఎపుడు వినలేదు
అది విన్న మనుమడపుడు
తాతను కూర్చుండ బెట్టినాడు
4)
కొంత దవ్వు నేగిరంత
లోకులు వీరిని చూచిరంత
ఏమివింత ఏమిటిది అనినగిరి
తాత యెడల క్రోధించిరి!
(సశేషము)

కామెంట్‌లు