బ్రతుకుబాట ..!!>విహారయాత్రలు;కోరాడ నరసింహరావు >విశాఖపట్నం

      ----------  16  ------------
       పిక్నిక్ లు.... విహార యా త్రల సరదాలన్నీ... ఎక్కువగా 
16 - 20 ఏళ్ల మధ్యలోనే.... జరిగాయి!
మా ఊరిలోనే కాకుండా.... 
నేను... నా జిగ్రీ దోస్తు ధర్మరాజు కలిసి... ఓ మారు విశాఖ పట్నం వెళ్లి జూ, బీచ్ లతో పాటు...పాత పోస్టాఫీస్ వెనుక 
సముద్రపు అంచున ఉన్న... 
వెంకటేశ్వర టెంపుల్... చర్చి, 
మసీదులను కూడా చూసాము 
ఆమూడూ మూడు మతాలకు ప్రతీకలుగా మూడు ఎత్తైన 
ప్రదేశాలలో త్రికోణం లాగా చూడటానికిఎంతోఆకర్షణీయం 
గా కనిపిస్తాయి.... ! 
అక్కడ అదంతాచూసిన ఆనందంతో... హార్బర్, డాక్యార్డ్ లు కూడాచూసి అక్కడ ఉన్న ఓ షిప్పు ను ఎక్కి లోపలంతా ఓ గంట ఎంజాయ్ చేసేవాల్లం...!
అక్కడ నుండి... కైలాసగిరి... 
ఆ కొండపై చాలా సరదాగా గడిపేవాల్లం.... !
 ఇంకోమారు మా బొబ్బిలి వేంకటరావు మామయ్యతో కలిసి నేను, ధర్మరాజు కూడా ఆటోలో... దేవీ పురం వెళ్లి వచ్చాం !వైజాగ్ కి అది చాలా దూరం... ! అక్కడ అన్నీ నగ్నంగా ఉన్న దేవీ విగ్రహాలే విశాలమైన ఆహ్లాదకర ప్రకృతి నడుమ అందంగా కట్టిన  శ్రీచక్ర 
ఆలయమది.... !
చూసి తీరవలసిందే.... !!
మరోమారైతే నేను మా వెంకటరావు మామయ్యా....
కుటుంబాలతో కలిసి స్టీల్ ప్లాంట్ వెనుక సముద్రానికి చేరువలో...* అప్పికొండ *
అనే శివాలయముంది... !
 అదికూడా... ప్రశాంత ఆహ్లాదకర వాతావరణమే .... !
   ఇవే కాకుండా ఇంతకు మునుపే...కేవలం నేను మిత్రుడు ధర్మరాజు కలిసి... 
తిరుపతి...మద్రాస్...కంచి,కాళహస్తి,  భద్రాచలం ...శ్రీశైలం, హైదరాబాదులు... 
అతితక్కువడబ్బులతో...చూడ  వలసిన ప్రదేశాలేవీ మిస్సవ్వకుం డా చాలా సరదాగా తిరిగి వచ్చాం... ! అంతకు మునుపొకమారు  మా చిన్నగురువు, 
మరికొంతమంది మిత్రులతో 
వీటిల్లో కొన్ని చూసి వచ్చినా 
ఇప్పుడు అనుభవించిన మజా అప్పుడు అనుభవించలేదు !
మార్పు లేని... నిరంతర జీవన యాతనలలో... ఈ పిక్నిక్ లు 
తీర్ధ, క్షేత్రాది విహారయాత్రలు 
ఎంతో ఉత్సాహాన్ని,ఉల్లాసాన్ని 
ఇచ్చి మనుషుల్లో నవ చైతన్యా న్ని నింపుతాయన్నది నా అనుభవం.... !!
                *******************
                 --------  సశేషం  --------
కామెంట్‌లు