బ్రతుకు బాట :- కళామతల్లి కటాక్షం - సాహిత్య - కళా రం గాలు...కోరాడ నరసింహా రావు

   ***  37  ****
    వచ్చిన ఆదాయం మూడు భాగాలైపోయినా... కాస్తంత ప్రశాంతత లభించినట్లని పించింది...!
నా భవానీ స్టూడియో కి...
ఫోటోలు తీయించుకుందుకు వచ్చేవాళ్లే కాకుండా... విభిన్న మనస్తత్వాలు గలవాళ్ళు... 
వాళ్ళకులము, మతము, వర్గముఇవేవీనేనుచూసేవాడిని కాదు... అందరితోనూ సరదాగా మాట్లాడే వాడిని !
ఏ కార్యం యే కారణంగాజరుగు తుందో...యే పరిచయం యే ప్రయోజనానికి కారణమవు తుందో... ఎవరూహించగలరు 
ఓ రోజు.... నా స్టూడియోకి... 
ఓ అబ్బాయి వచ్చి...జాగృతి అనే పత్రికను చేతికిచ్చి... 
చందాదారుగా చేరేట్టు కన్విన్స్ చేసాడు.... !
ఆ పత్రికలో "యువకళాలు " 
అనే శీర్షిక..!అందులో...ఇచ్చిన వార్తకు స్పందన రాస్తున్నారు !
దాన్ని రాసినవారి ఫోటోతోసహా అక్కడ ప్రచురిస్తున్నారు !
 ఆరోజక్కడ " నల్లా నీటిలో... 
మల, మూత్రాలు " అనే హెడ్డింగ్ తో ఒక వార్త ఇచ్చారు 
నాలో కూడా స్పందన కలిగింది 
నా స్పందనను రాసి ఫోటోతో సహా పంపించాను !
అది... ప్రచురితమైంది ! 
నా ఫోటో తో సహా నేనురాసింది పత్రికలో చూసేసరికి... ఇంక నా ఆనందానికి హద్దులు లేవు.. !
అది చూసిన మా పార్వతీపురం రచయితలు... స్టూడియోకి రావటం... నన్నెంకరై జ్ చెయ్యటం తో...నేనూ చిన్న -
చిన్న కవితలు రాయటం మొదలు పెట్టాను.. !మా పార్వతీపురంలో కవులు, రచయితలూ కళాకారులకు కొదువ లేదని తరువాత నాకు బోధపడింది !
సీనియర్ బాలగేయ రచయిత 
తాళ్లపూడి వెంకటరమణ మాప్రక్కవీధే... వాళ్ళ డిపోనుండే మేము కోటా తెచ్చు కుంటాం... అంతవరకూ ఆయన అంతగొప్ప బాలగేయ రచయిత అని నాకు తెలీదు !
నేను ఉమాస్టూడియో లో పనిచేసేరోజుల్లోనే...ఉమాస్టూడియోకి ఎదురుగా ఉన్న తెలుగు మందులషాపుకు ఒకాయన వచ్చేవాడు ! అతని వెనుక ఇద్దరు పోలీసులు బాడీ గార్డులుగా ఉండేవారు... అతనో కమ్యూనిష్టని, ఇంఫార్మెర్ గా మారిపోయాడని 
ఎక్కడ నక్సలైట్లు చంపెస్తారో...
నని అలా రక్షణ కల్పించారని గుస - గుసగా చెప్పుకునేవారు ఇప్పుడాయన స్వేచ్ఛగానే తిరుగుతున్నాడు కొత్తగా కట్టిన 
r t c... కాంప్లేక్షు లో పుస్తకాల షాపు పెట్టుకున్నాడు !అతడే సీనియర్ పాత్రికేయుడు, రచయిత సముద్రాల సత్యనారాయణ అన్న సంగతి 
ఈ నేపథ్యం లోనే తెలిసింది... 
ఇంక మాఊర్లో జంట రచయిత లంటాం... బెలగాం భీమేశ్వర రావు, బెహరా ఉమామహేశ్వర రావు, వీళ్లిద్దరు మంచి బాలసాహిత్య వేత్తలు ఇద్దరూ ఉపాధ్యాయులే...మంచి సీనియర్ కదా రచయిత పీ వీ బీ శ్రీరాంమూర్తిగారు... ఇలాంటి వాళ్ళతో పాటు అప్పుడప్పుడే నాలాగే రచనా రంగం లోకి ప్రవేశించిన అయ్యగారిశ్రీనివాస రావు, గంటేడ గౌరినాయుడు... 
పాలకొల్లు రామలింగస్వామి, 
రాగోలు శంకర రావు... ఇలాంటి ఆ ప్రాంతంలో ఉన్న రచయిత లందరితోనూ... పరిచయాలేకాదు...మాస్టూడియో ఒక సాహితీ వేదికగా నిరంతరం కలయికలు, చర్చలు 
జరుగుతూనే ఉండేవి... !!
      ******-
     .......  సశేషం ........
కామెంట్‌లు