అరిస్టాటిల్.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ప్రాచీన గ్రీకు తాత్వికుడు ముగ్గురిలో ఒకడు. రెండవవాడు ఆయన గురువు ప్లేటో. మూడు వారు ప్లేటో గురువు సోక్రటీస్. ఈయన గ్రీస్ లో ని స్టాగిరాలో 384 లో జన్మించారు. ఇతని తండ్రి మేసిడోనియా రాజు ఫిలిప్ 11 కి వైద్యుడు జీవ శాస్త్రం పై మక్కువ తండ్రి నుండి సంక్రమించగా అదెన్స్లోని ప్లేటో అకాడమీలో విద్యార్థిగా చేరి గురువుని మించిన శిష్యుడు అనిపించుకుని జ్ఞానం ప్లేటులో తోనే ఆగిపోదు అది నిరంతరం అన్నా ప్రజ్ఞాశాలి. 343 వరకు ఆ కాలనీ లో ఉన్నారు మెసిడోనియా రాజు ఫిలిప్ కోరికపై అతడి కుమారుడు అలెగ్జాండర్ కి చదువు చెప్పాడు. అలెగ్జాండర్ అయిన తర్వాత తిరిగి వచ్చి తన సొంత లై సిమ్ అకాడమీని స్థాపించాడు. ఆయన 400 గ్రంధాలు వ్రాశాడని చెబుతారు. అయితే ఒక్కటి మాత్రం నిజం అతడు అన్ని శాస్త్రాలను వర్గీకరించి జంతు, వృక్ష, భౌతిక, తత్వ రాజకీయ, అర్ధ, మనో విద్యాన, నీతి, అలంకార శాస్త్రాలు గా విడగొట్టి తర్వాత తరాలకు మార్గదర్శకుడు అయ్యాడు. తన జీవితాంతం బోధన నూతన ఆవిష్కరణలో తలమునకలై క్రీస్తుకు పూర్వం 322లో మరణించాడు. దైవం మీద నమ్మకం లేదని చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు ఇతడి శత్రువులు ఇతడిపై అభియోగం మోప గాఎదెన్స్ నుండి ఇ పారిపోయాడని చెబుతారు.
కామెంట్‌లు