గీతాంజల; -- గురించి...రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 27. ప్రేమ దివ్వెను జీవితంతో వెలిగించు "
ఉరుములు, మెరుపులు, నల్లని కఠిన శిలలవంటి ఆందోళనకరమైన జీవన కాళరాత్రులు నీ జీవితంలో తొంగిచూస్తుండవచ్చు. అటువంటి కారు చీకట్లలో సైతం కాలాన్ని కరిగిపోనివ్వకు. కాంతి పథాన్ని వెతుకుతూ ప్రేమ జ్యోతిని మీ జీవితంతో వెలిగించుకోమంటూ మానసిక స్థైర్యాన్ని కవి నూరి పోస్తున్నాడు. కాంతిని వెదుకుతూ తపించాలి. నీలో దీపం వున్నా కాంతిలేని కొరతను తరిమి కొట్టడానికి అగ్నిని మరింత ప్రజ్వలితం చేసుకోవాలి. ఇటువంటి దైన్యస్థితితో నిండిన జీవితం కన్నా చావే నయమంటూ దుఃఖం నా తలుపు తడుతోంది. కారుచీకట్ల మాటున నిరంతర జాగరూకతతో వున్న భగవంతుడు నన్ను రమ్మంటూ ప్రేమ సంకేతాలు పంపిస్తున్నాడు. నాలో ఈ సంచలన, కలవరభావాల సృష్టికి మూలకారణం నాకు అర్థం కావడం లేదు. అప్పుడప్పుడు మెరుపులు మెరిసినా నా జీవితంలో వాటి కాంతి క్షణకాలం మాత్రమే. ఆ తరువాత నా కళ్ళముందు అంతా చీకటే. ఈ చీకటిరాత్రి నన్ను ఎక్కడికి పిలుస్తుందో ఆ దారిని గుర్తించాలని నా హృదయం తపిస్తుంది.

కామెంట్‌లు