దీపావళి ;-సావిత్రి రవి దేశాయ్--కలం స్నేహం
అమావాస్య నిశి వేళ కన్ను పొడుచుకున్న
కానరాని చీకట్లు కమ్మినవేళ
ఇంటి ఇల్లాలు చిరు నగవుతో
చిరుదీపం వెలిగించి ఇంకొకటి
మరొకటి ఇలా ఒకరి తర్వాత
ఒకరు వెలిగించిన దీపాలతో
వేల సూర్యులు భువికి
దిగి వచ్చిరాయాన్నంత
వెలుగు సంతరించుకుంది....

దిక్కులు పిక్కటిల్లెలా టపాసుల మోతలు
ఎంత పెద్ద విస్ఫోటనం జరిగిందో అన్నట్లు
అతి పెద్ద అగ్ని బుడగ పేలినట్టు, 
మర్త్య లోక అందాలు చూడ
ఇలకు దిగివచ్చిన తారలు
చూసింది చాలు, ఇక ఇళ్లకు పదమంటూ
నింగికి ఎగిసినట్టు ఎగిరే నిప్పురవ్వల చిచ్చుబుడ్లు....

అంత్యరిక్షమే నా హద్దు ఆకాశం దాటి
దేవలోకపు అంచులు చూస్తాను
అన్నట్టు నింగి కెగిసే రాకెట్లు...
ఈ పండగ సంబరాల అల్లరితో
ఆకాశాన్ని సైతం చించేసే  చిన్నారుల కేరింతలు...
మరుసటి ఏడాదికి తిరిగి రమ్మంటు
సునామి లా దూసుకు వచ్చే దుఃఖన్ని ఆపుకుంటూ వీడ్కోలు...


కామెంట్‌లు