ప్రేమఖని.;-అనూరాధ మేరుగు-కలంస్నేహం
అమ్మ పిలుపు తొలికోడి కూత నేపథ్యసంగీతంలా...
వినిపించి కళ్ళు తెరిచా...

ఆకాశాన్ని ముద్దిడినట్టు పెరిగిన ఎత్తైన వృక్షరాజసంపై వాలిన పిచ్చుకల కిచకిచ ....
జలపాతాల గలగలల హోరు గిరులనుంచి దొలగినట్లు నాతో ముచ్చట్లాట....

పరిసరాల పచ్చికబయళ్ళ మీది నుంచి సాగర అలలుగా చల్లని గాలి సాగి మేనుని తాకుతూ.....

బంగారుతీగతో అల్లిన సాలీడు గూడే గడ్డివాము... అంచునుండి...
అంబా అంటూ చిట్టి లేగదూడ తల్లి ఆవు తనువు నాకుతూ....

చలిగిలి నను చట్టుబండలా ముడ్చుకుపోయేలా చేసినా...
నా బంధపు పూలతీరాలన్నీ చుట్టిరావాలన్న ఆశతో....

ప్రభాతకిరణపు వెలుగురేఖల రెక్కలు తొడిగి....
ఆశగా అనుభూతుల ఆనందాల్ని మాలగా అల్లుదామని ....

నిరంతర శ్రమ ఖని ....
నీళ్ళల్లో దీపాలు వెలిగించినట్టు  నవ్వే నా మట్టి మనుషుల విశిష్ట ప్రవాహస్పర్శనలమాలని ....
బయలుదేరా....
నిజం.... 
ముక్తికి తెర్చిన ద్వారాలే కదా గ్రామాలు....


కామెంట్‌లు