గీతాంజలి ;--రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు

 29. "ప్రతిష్టల మాటున దూరమయ్యే స్వస్వరూపుడు.” మానవుడు తన ప్రతిష్టల నీడ అనే చీకటి సృష్టించుకుని తనలోని అంతర్గతమైన స్వస్వరూపానికి ఎడమైపోతుంటాడనే అంశాన్ని ఈ ఖండిక వ్యక్తపరుస్తుంది.
ఈ ఐహిక ప్రపంచంలో నాకు సంక్రమించిన ప్రతిష్టలతో నాచుట్టూ ఒక గోడను నిర్మించుకోవాలని మొదలు పెట్టాను. ఆ గోడ ఎత్తు పెరిగే కొద్ది నా చుట్టూ అల్లుకున్న చీకటి కారణంగా నా రూపం మందగించడం జరిగింది. నేను నిర్మించుకున్న ఎత్తైన కృషిని చూసి మొదట గర్వపడుతూ ఆ నిర్మాణంలో వెలితి లేకుండా జాగ్రత్త పడ్డాను. బాహ్య పరమైన ఆ శ్రద్ధ ఎక్కువయ్యే కొద్దీ ఆత్మ పరమైన స్వస్వరూపం నాకు దూరమౌతుంది.

కామెంట్‌లు