చలిపులి ;- కోరాడ నరసింహా రావు... !

 గజ - గజ లాడించు చలికి .... 
  దుప్పటిలో ముసుగు తన్ని...  లేవ బుద్ధి కానున్నది !
చలిమంటల వెచ్చదనాన్ని 
వదల నివ్వకున్నది... !
వేడి -  వేడి టీ, కాఫీలు... 
మరీ -  మరీ కోరుతున్నది !నునువెచ్చని కౌగిలిలు వీడలేని 
జంటలు... !
చేయక తప్పని పనులను దలచి...చెప్పలేని చిరాకులు!
ఆశపడి ఎండను కోరితే... 
ఒళ్ళంతా చిరామరలు !
నీడలోన ఉండనివ్వదు... ఎండలోకి పోనివ్వదు !
పని, పాటులు చేయనివ్వదు! 
అయ్యప్ప భక్తులకు,
ధనుర్మాస దీక్షాపరులకూ....
సహన పరీక్షలు బెట్టగా ... 
పులిలా వస్తుంది... ఈ చలి... !!
కామెంట్‌లు