మరల మరల;-బి.హరిరమణనిజామాబాద్.- కలం స్నేహం
లేలేత మొక్క
 మారాకులు వేసి శాఖలతో విశాలంగా 
నీడనిచ్చే ఆదుకొను జీవ జనావళికి

 చిగురుటాకుల పొత్తిళ్లలో పువ్వుగా వాసన లీను
 సొగసుల గంధానిగా
మరులు గొలిపి

 నునులేత పిందెనై
 నూనూగు మేనుతో
 ఆకు మాటున దాగి పిల్లగాలి ఉయ్యాలలో
పరవశింప గా చిన్న కీటకాలు 
వానర మూకలు
 చిలుక పలుకుల తో స్నేహం నటిస్తూనే నన్ను కబళించే బాల గండములు ఎన్నో

శక్తితో వ్యక్తితో జీవన గమనంలో
 నన్ను నేను కాపాడుకుంటూ
 అమృత ఫలమునై
 పరుల కొరకే నా జీవనమని
 పెద్దల మాటలు మనసులో నిలుపుకొని  నా జన్మకు సార్థకం ఇతరుల క్షుద్బాధ తీర్చడమే

 ఎప్పుడో నా జీవన. గమనంలో
 ముదిమినయి ఈ నేల రాలుదునో
లేక అదరువుగా మారుదునో.....

అయినా మరల మరల జన్మిస్తూనే ఉంటా చెట్టుమీద కాయగా....


కామెంట్‌లు