సునంద భాషితం;-వురిమళ్ల సునంద ఖమ్మం
  జ్ఞాపకాలు
*******
మానవులు అత్యధికంగా నెమరేసుకునే గతాలే జ్ఞాపకాలు.
జ్ఞాపకాలు వెంటాడే నీడలు,తోడుండే నేస్తాలు కూడా
జ్ఞాపకం గత స్మృతుల భాండాగారం.
అన్ని విషయాలను దాచుకునే బ్యాంకు. 
జ్ఞాపకశక్తిని బట్టే విద్యార్థుల, వ్యక్తుల తెలివితేటలు బయటపడుతుంటాయి.
ఏవైనా కళలలో ప్రావీణ్యత సంపాదించేందుకు,పాత తరాల వారిని ప్రేరణగా తీసుకునేందుకు, పొరపాట్లను సరిచేసుకుని ఆచి తూచి అడుగు వేసేందుకు జ్ఞాపకాలు ఎంతగానో దోహదపడతాయి.
కాబట్టి చేదు జ్ఞాపకాలను వదిలేద్దాం. మంచి జ్ఞాపకాలతో  మన నైపుణ్యాలకు మెరుగు పెట్టుకుందాం.
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు